హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: లోయలో పడిన కారు.. స్వల్ప గాయాలు

BDK: గుండాల మండలం దేవల్లగూడెం సమీపంలోని యూ ఆకారపు మూలమలుపు వద్ద సోమవారం సాయంత్రం కారు అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదంలో కారు యజమాని స్వల్పంగా గాయపడ్డారు. గోదావరిఖని చర్చి పాస్టర్ ప్రకాష్ పాల్ కొత్తగూడెంలో చదువుతున్న పిల్లలను చూసేందుకు వెళ్తుండగా ఘటన జరిగింది. అనంతరం బైక్‌పై లిఫ్ట్ తీసుకుని గుండాల ఆస్పత్రికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.