హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెల్టుషాపులు తొలగించాలని ఫిర్యాదు

ASF: కాగజ్‌నగర్‌ మండలం దుర్గానగర్ విలేజ్‌ నంబర్‌-5లో బెల్టుషాపులను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ మహిళలు పెద్ద ఎత్తున సోమవారం ధర్నాకు దిగారు. అనంతరం ఈజ్ గావ్ పోలీస్‌స్టేషన్‌లో వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో బెల్టుషాపులు ఎక్కువగా ఉండడంతో పురుషులు మద్యానికి బానిసలయ్యారని, కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.