హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండచరియను ఢీకొట్టిన లారీ

SS: పెనుకొండ పట్టణ శివారులోని రొద్దం ఘాట్ రోడ్డు దిగుతుండగా లారీ అదుపుతప్పి కొండచరియను ఢీకొంది. కర్ణాటకలోని చలికేర నుంచి తౌడు లోడుతో చిత్తూరుకు వెళుతున్న ఓ లారీ అదుపుతప్పి కొండచరియను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ దాదాపీర్ లారీలో ఇరుక్కుపోవడంతో అటుగా వెళుతున్న వాహనదారులు ఓ జేసీబీ సాయంతో బయటకు తీసి రక్షించారు. క్షతగాత్రుడిని పెనుకొండ ఆసుపత్రికి తరలించారు.