హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏదుళ్ల చెరువులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.!

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఏదుళ్ల చెరువు గ్రామ పంచాయతీ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. సోమవారం జరిగిన ఈ పంపిణీ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వినోద, ఉప సర్పంచ్ రమేష్ పాల్గొని కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, స్థానిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు.