HYD: సైబరాబాద్ పోలీసులు భారీగా చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న దందా గుట్టు రట్టు చేశారు. ఏపీలోని పలు చేపల చెరువులకు దాణాగా వేసేందుకు అక్రమ మార్గంలో తరలిస్తున్న 100 టన్నుల చికెన్ వ్యర్థాలను పశువైద్య అధికారులతో కలిసి దాడులు చేసి, సీజ్ చేశారు. చికెన్ వ్యర్థాలను మేతగా వేసి పెంచిన చేపలను వినియోగించడం వల్ల ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ
భారీగా చికెన్ వ్యర్థాల తరలింపు.. సీజ్


