హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనం పెంచాలి'

NLG: మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఎన్నికల హామీ మేరకు రూ.10,000 వేతనం చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం, పోలే సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నల్లగొండ డీఈవో కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం ఏడీ రామాచారికి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు.