హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోలీసులు రౌడీలా వ్యవహరిస్తారా'

కోనసీమ: మండపేటలో అర్ధరాత్రి పేదల గుడిసెలను కూల్చివేయడంపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు అధికార పార్టీకి ఊడిగం చేయడం సరికాదని విమర్శించారు. పేదల ఇళ్లను రాత్రివేళ కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. మండపేటలోని అన్ని ఆక్రమణలను తొలగించే దమ్ము అధికారులకు ఉందా అని మున్సిపల్ కమిషనర్‌ను నిలదీశారు.