హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులుస చేపలను ఇలా వండితే రుచి అదరహో..!

గోదావరి ప్రాంతం అంటే చేపల పులుసుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజా చేపలకు చింతపండు రసం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం, మసాలాలు జోడించి మట్టి కుండలో నెమ్మదిగా వండేవారు. కుండలో తక్కువ మంటపై ఉడికించడం వల్ల పులుసు చిక్కగా మారి, మసాలాల రుచి చేపల్లోకి బాగా ఇంకేది. అందుకే పాతతరం వంటల్లో మట్టి కుండలో చేసిన చేపల పులుసుకు ప్రత్యేక స్థానం ఉండేది.