హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నమయ్య జిల్లాలో భారీ వర్ష సూచన

అన్నమయ్య జిల్లాలో రాబోయే 3 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకల సమీప ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వర్షాల సమయంలో విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద ఉండకుండా జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించారు.