ASR: అరకు మండలం సుంకరమెట్ట పీహెచ్‌సీ పరిధిలో రూ.35 లక్షలతో నిర్మించిన బర్త్ వెయిటింగ్ హాల్‌ను కలెక్టర్ నిశాంతితో కలిసి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు ఇది 30వ బర్త్ వెయిటింగ్ హాల్ అని వివరించారు. గర్భిణీలు బర్త్ వెయిటింగ్ హాల్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు
ఆంధ్రప్రదేశ్
'గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలి'


