AKP: బుచ్చయ్యపేట మండలంలో వర్షాలు లేక వరి నాట్లు తీవ్రంగా ఆలస్యమవుతున్నాయి. ఈ ఏడాది మండలంలో 2,415 హెక్టార్లలో వరి సాగు లక్ష్యం కాగా, ఇప్పటివరకు కేవలం 345 హెక్టార్లలో మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి వెయ్యి హెక్టార్లలో నాట్లు పూర్తి కావడం గమనార్హం. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడమే ఈ జాప్యానికి ప్రధాన కారణమని మండల వ్యవసాయ అధికారి నారాయణరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'వర్షాభావంతో ఆలస్యమవుతున్న నాట్లు'


