E.G: ఆదాయం లేని చిన్న, పురాతన ఆలయాల్లో నిత్య పూజలు చేయడానికి ధూప దీప నైవేద్యం పథకం కింద ప్రభుత్వం నెలకు రూ.10 వేలు అందిస్తుందని రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అర్హులైన వారు ఈ నెల 30 లోగా తమ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. దేవదాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
చిన్న ఆలయాలకు నెలకు రూ.10 వేలు: MLA


