హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనసేనలోకి కొండా సుస్మిత?

WGL: కొండా సుస్మిత జనసేనలో చేరే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయంగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రేపు జూబ్లీహిల్స్‌లో జనసేన కీలక నేతతో సుస్మిత భేటీ కానున్నట్లు తెలుస్తోంది. పరకాల టికెట్‌తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ బాధ్యతలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.