NRML: అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. ఇవాళ కుంటాల రైతు వేదికలో 73 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ముధోల్ నియోజకవర్గంలో తొలి విడతగా 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, రెండో విడతలో మరో 2,500 ఇళ్లు మంజూరు కానున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు: ఎమ్మెల్యే


