హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు

SRCL: వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారంలో శ్రీ కన్వెన్షన్‌లో ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చందుర్తి, మల్యాల గ్రామాలకు చెందిన కోలాటం కళాకారులు తమ జానపద కళా ప్రదర్శనలతో ప్రత్యేకంగా నిలిచారు. మన గ్రామీణ జానపద కళలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించడం మనందరి బాధ్యతని కళాకారులు పేర్కొన్నారు.