ప్రకాశం: మార్కాపురం డివిజన్ పరిధిలోని 271 గ్రామ పంచాయతీల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2776 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు డీడీఓ డా. పి.సుజాత తెలిపారు. మొత్తం 5,47,752 మంది ఓటర్లు ఉండగా పురుషులు 2,76,511 మంది, మహిళలు 2,71,214 మంది, ఇతరులు 27 మంది ఉన్నారన్నారు. పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రకటించినట్లు ఆమె చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
డివిజన్‌లో 2776 పోలింగ్ కేంద్రాలు


