హైదరాబాద్: 28°C
తెలంగాణ

భవనం కూలిన ఘటనలో యజమాని అరెస్ట్

RR: గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో G+6 భవనం కూలిన ఘటనలో యజమాని సయ్యద్ సాజిద్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. దేశం విడిచి పారిపోతుండగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ అనుమతులు లేకుండానే నిర్మాణం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, కాంట్రాక్టర్ ఖాజా కోసం గాలింపు కొనసాగుతోంది.