హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

NLR: ఇందుకూరుపేట మండలంలోని లేబూరు గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లేబురు గ్రామానికి వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో పక్కనే ఉన్న పంట కాలువలోకి ఆటో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలకు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రొయ్యల ఫ్యాక్టరీలో పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.