NTR: నందిగామ ప్రభుత్వ డీవీఆర్ ఏరియా ఆసుపత్రిలో రూ.35 లక్షల విలువైన అత్యాధునిక స్కానింగ్ పరికరం రేడియాలజిస్ట్ లేకపోవడంతో నిరుపయోగంగా పడి ఉంది. స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించిన ఈ యంత్రం రెండు మూడు నెలలు మాత్రమే పనిచేసి, ఇప్పుడు మూలనపడింది. దీంతో పేద రోగులు ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు వెళ్లి రూ.1500 నుంచి రూ.3000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఆంధ్రప్రదేశ్
నిరుపయోగంగా స్కానింగ్ మిషన్


