హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బిల్లులు వెంటనే చెల్లించాలి'

ASR: పీఎం జన్మన్ ఇళ్ల బిల్లులను వెంటనే చెల్లించాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. డుంబ్రిగూడ మండలం ఇసుకల, బల్డగడ్డ, తోకలాసేరు, బుడ్డింగి గ్రామాల్లో లబ్ధిదారులకు బిల్లులు అందక నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయని తెలిపారు. పీఎం జన్మన్‌ 2.0లో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను గుర్తించి బిల్లులు వెంటనే మంజూరు చేయాలని కోరారు.