హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫీజు బకాయిలపై రఘునందన్‌రావు ఫైర్

HYD: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ MP రఘునందన్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఏడాది నుంచి రూ.2 వేల కోట్లు కేటాయిస్తామనడం ప్రస్తుత సమస్యకు పరిష్కారం కాదన్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు.