హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరంలో జర్నలిస్టుల ఆందోళన

విజయనగరం బాలాజీ జంక్షన్ వద్ద జిల్లాకు చెందిన జర్నలిస్టులు సోమవారం నిరసన తెలిపారు. పూసపాటిరేగ మండలానికి చెందిన విలేకరి గోవిందపై జనసేన నాయకుడు దాడిని ఖండిస్తూ మానవహారం నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. అక్షరంపై దాడి చేయడం బాధాకరమని, ఆధారాలన్నీ ఉన్నప్పటికీ నిందుతిడిని అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు.