SKLM: సారవకోట మండలం కిన్నెరవాడ గ్రామ సమీపంలో సోమవారం ఓ కారు అదుపుతప్పి వంశధార ఎడమ కాలువలోకి దూసుకుపోయి నీట మునిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడగా కారులో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కాలువలోకి కారు.. ఇద్దరు గల్లంతు


