PPM: జియమ్మవలస మండల కేంద్రంలోని పీహెచ్‌సీని జిల్లా లెప్రసి, ఎయిడ్స్ అండ్ టిబి ఆఫీసర్ డాక్టర్ షేక్ హఫీజా సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవలు, మందుల నిల్వలు, టీబీ రోగులకు అందుతున్న సేవలు, ల్యాబ్ పనితీరును పరిశీలించారు. రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ దిలీప్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ


