JGL: భీమవరం మండలంలోని గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండాలని సోమవారం హనుమాన్ మందిరంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బిందెలతో నీటిని తీసుకువచ్చి, స్వామివారికి జలాభిషేకం నిర్వహించారు. వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, వాగులు నీటితో నిండాలని ప్రార్థించారు. గ్రామ సర్పంచ్ బొమ్మెన ప్రశాంత్, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: వర్షాలు సమృద్ధిగా కురవాలని పూజలు


