హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

JGL: మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్యం, మందులు, సిబ్బంది పనితీరు, పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. రక్త పరీక్షలు, ఎక్స్‌రే సేవలు సక్రమంగా లేవని రోగులు ఫిర్యాదు చేయగా, వెంటనే డీఎంహెచ్‌ఓతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.