హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్మికుల తొలగింపుపై ఏఐటీయూసీ నిరసన

అన్నమయ్య: మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 50 ఏళ్లు నిండాయనే కారణంతో పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తొలగించడం అన్యాయమని ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి తిరుమల అన్నారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి వినతిపత్రం అందజేశారు.