హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదల సొంతింటి కలకు సాకారం: వెలిచాల

KNR: ​ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తోందని పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. సోమవారం చామనపల్లి గ్రామంలో జగదీష్ దంపతుల గృహప్రవేశంలో ఆయన పాల్గొని, ఇండక్షన్ స్టవ్, గిన్నెలు బహుమతిగా ప్రకటించారు. రెండు విడతల్లో 6 లక్షల ఇళ్లు మంజూరయ్యాయన్నారు. అర్హులైన అసంపూర్తి ఇళ్లకు సైతం రూ.2 లక్షల సాయం అందిస్తామన్నారు.