MLG: కన్నాయిగూడెం మండలంలోని సింగారం గ్రామంలో దేపక వెంకటీకి చెందిన ఇల్లు కూలిపోయింది. వర్షాల కారణంగా ఇల్లు దెబ్బతిని కూలినట్లు సమాచారం. దీంతో బాధిత కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిలువ నీడలేని తము ప్రస్తుతం ఎక్కడ ఉండాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పరిశీలించి, బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా సహాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
సింగారం గ్రామంలో కూలిన ఇల్లు


