JGL: సారంగాపూర్ మండల కేంద్రంలో జరిగిన ప్రజావాణిలో రేచపల్లి గ్రామానికి చెందిన రైతు బేర మహేశ్ ప్రభుత్వం యూరియా కోసం తెచ్చిన యాప్ సరిగా పనిచేయడం లేదని ఎంపీడీవో నీరజకు ఫిర్యాదు చేశారు. యాప్ సరిగా పనిచేయక పోవడంతో ఓటీపీలు రావడం లేదని పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఈ తీవ్ర ఇబ్బందులను తొలగించి, పాత పద్ధతిలోనే యూరియా అందజేయాలని ఆయన అధికారులను కోరారు.
తెలంగాణ
యూరియా యాప్‌పై ప్రజావాణిలో ఫిర్యాదు


