హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధ్వానంగా వీధి రోడ్డు

ASR: డుంబ్రిగుడ మండలం కండ్రూం పంచాయతీ జోడిగుడ గ్రామంలో వీధి రోడ్డు అధ్వానంగా మారింది. వర్షాలు కురిసిన ప్రతిసారీ రహదారి మొత్తం బురదమయంగా మారడంతో గ్రామస్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు వెళ్లేందుకు కూడా ఇబ్బందికరంగా మారింది. సంబంధిత అధికారులు స్పందించి వీధిలో సీసీ రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.