హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ షాక్‌తో పామాయిల్ కూలి మృతి

ELR: చింతలపూడి (మం) కమలాపురంలో సోమవారం విద్యుత్ షాక్‌తో పామాయిల్ కూలి మృతి చెందాడు. పామాయిల్ తోటలో గెలలు కోయటానికి వచ్చిన వీరంపాలెంకు చెందిన చౌటపల్లి పుల్లయ్య (40) గెలలు కోసే క్రమంలో విద్యుత్ వైర్లు తగులుతాయని ఏబీ స్విచ్ ఆపే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.