హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి'

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదోని న్యాయవాదులు సోమవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వాలు హామీలు ఇచ్చి మోసం చేశాయని సీనియర్ న్యాయవాది లోకేశ్‌ ఆరోపించారు. రాయలసీమ ప్రజల న్యాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.