హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనారిటీ సంక్షేమ కమిటీ ఛైర్మన్‌గా లక్ష్మీకాంతారావు

KMR: తెలంగాణ శాసనసభలో మైనారిటీ సంక్షేమ కమిటీ ఛైర్మన్‌గా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో గౌరవ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు పాల్గొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తానని హమీ ఇచ్చారు.