హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక నేతలతో నేదురుమల్లి భేటీ

NLR: వెంకటగిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని వాకాడు, కోట, చిట్టమూరు మండలాల నేతలు కలిశారు. వాకాడులోని ఆయన నివాసంలో సోమవారం జరిగిన భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని, గ్రామస్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు.