JN: పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు పంజా కల్పన సోమవారం MLA యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకానికి సహకరించిన MLAకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజా సేవకు అంకితమవుతానని కల్పన తెలిపారు.
తెలంగాణ
ప్రజా సమస్యల పరిష్కరానికి పనిచేయాలి: MLA


