హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలనీలో తాగునీటి తిప్పలు

KKD: ప్రత్తిపాడు మండలం చింతలూరు SC కాలనీలో తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి ఒకే వాటర్ ట్యాంక్ ఉండటంతో పది నిమిషాలు కూడా నీరు సరఫరా కావడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సరఫరాను మెరుగుపరచడంతో పాటు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.