హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదాల నివారణకు కలెక్టర్‌కు వినతి

NLG: కనగల్ (M) చెట్ల చెన్నారం స్టేజీ వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ గుర్రంపోడు(M) తేనెపల్లితండ మాజీ సర్పంచ్ నాగరాజు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. రోడ్డు ఇరుకుగా ఉండటంతో పాటు ప్రమాదకరమైన మలుపు కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం రోడ్డు పనులు జరుగుతున్నందున వెడల్పు చేసి, రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.