హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు ఎలుకల నివారణ మందు పంపిణీ

WG: పెనుగొండ మండలం వడలి రైతు సేవా కేంద్రంలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమంలో భాగంగా సోమవారం వ్యవసాయ అధికారులు రైతులకు ఎలుకల నివారణ మందును పంపిణీ చేశారు. పొలాల్లోని ఎలుకల బొరియల వద్ద మందును 10 గ్రాముల చొప్పున పాట్లాలుగా కట్టి ఉంచాలని సూచించారు. ఈ పద్ధతి పాటించడం ద్వారా ఎలుకల నుంచి పంట నష్టాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చని అధికారులు వివరించారు.