JGL: తమను ఆసరా పెన్షన్ పథకంలో చేర్చాలని మండల మహేంద్ర(మేదరి) సంఘం నాయకులు కోరారు. సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో చిరంజీవికి సంఘం అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. ప్లాస్టిక్ రాకతో వెదురు వృత్తి దెబ్బతిని ఉపాధి కోల్పోయామన్నారు. చేనేత, గౌడ కులస్తుల తరహాలో కష్టాల్లో ఉన్న తమకు కూడా నెలకు రూ.2016 ఆసరా పెన్షన్ అందించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
తెలంగాణ
'మేదరులకు 'ఆసరా' పెన్షన్ మంజూరు చేయాలి'


