హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండేళ్లలో చింతలపూడి ప్రాజెక్టు పూర్తి: సీఎం

ELR: చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే నూజివీడు ప్రాంత భవిష్యత్తు పూర్తిగా మారిపోతుందని CM చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం ముసునూరులో ఆయన మాట్లాడారు. రాబోయే 2, 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. చింతలపూడి పథకం అందుబాటులోకి వస్తే మెట్ట ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.