హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యవసాయమే దేశ ఆర్థిక వ్యవస్థకు ఆధారం: గవర్నర్

ELR: ముసునూరులో గవర్మెట్ పాప్కార్నికా సంస్థ రూపొందించిన దేశంలోనే తొలి నాన్-జీఎంవో పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని గవర్నర్ నజీర్ ఆవిష్కరించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే ప్రధాన ఆధారమని ఆయన పేర్కొన్నారు. 140 కోట్లకు పైగా జనాభాకు ఆహారం అందిస్తూ ఆర్థిక ప్రగతిలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. జీడీపీలో వ్యవసాయ వాటా 17 శాతంగా ఉందన్నారు.