హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్మశాన వాటికకు దారి ఏర్పాటు చేయాలి'

BDK: అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సదర్ లాల్ ఉప సర్పంచ్ ప్రకాశరావు ఇవాళ ప్రజావాణిలో తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ పరిధిలో స్మశాన వాటికకు రహదారి మార్గం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్మశాన వాటికకు వెళ్లే డొంక దారిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొని రహదారి ఏర్పాటు చేయాలన్నారు.