హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పర్యావరణహిత విగ్రహాలని పూజించాలి'

CTR: నియోజకవర్గ పరిధిలో మట్టితో చేసిన గణపతి విగ్రహాలనే పూజకు వినియోగించాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు. సోమవారం ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావుతో కలిసి చిత్తూరు దొడ్డిపల్లిలో వినాయకుడి మట్టి విగ్రహాల తయారీని పూజలు నిర్వహించి ప్రారంభించారు. రానున్న వినాయక చవితికి పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలనే వినియోగించాలని సూచించారు.