హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వర్షంలోను యాదాద్రీశుడిని దర్శించుకుంటున్న భక్తులు

BHNG: కురుస్తున్న వర్షానికి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయం తడిసి ముద్దయ్యింది. వానలో ఆలయ గోపురాలు కనువిందు చేస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షం ఆటంకం కలిగినా భక్తుల రాక తగ్గలేదు. తడుస్తూనే స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఉరుకులు, పరుగులు.. మండపాల్లో తలదాచుకుంటూ.. వర్షంలో యాదాద్రీశుడి దర్శనం చక్కటి అనుభూతి కలిగించిందని యాత్రికులు తెలిపారు.