హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెల్త్ సెంటర్ భవనానికి భూమి పూజ

NDL: జూపాడుబంగ్లా మండలం తరిగోపుల గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన హెల్త్ సెంటర్ భవనానికి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయ సూర్య భూమిపూజ సోమవారం నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.