NZB: మోస్రా మండలం గోవూరు గ్రామ పరిసరాల్లో సోమవారం చిరుత సంచరించినట్లు ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ కనిపించిన అడుగుల గుర్తులు చిరుతవేనని అధికారులు నిర్ధారించారు. దీంతో గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
VIDEO: జిల్లాలో చిరుత కలకలం.!


