హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారుమూరి అరెస్ట్‌ పాపాల ఫలితం: గళ్లా మాధవి

GNTR: కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్‌ కక్ష సాధింపు కాదని ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. కాసుల కోసం 30 వేల మంది మహిళల తాళిబొట్లు తెంచారని ఆరోపించారు. ఇప్పుడు కులం, కక్ష అంటూ వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈడీ చర్యలకు కులం, కక్ష రంగు పులమడం అర్థరహితమన్నారు. దర్యాప్తును ఎదుర్కొనే ధైర్యం లేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.