హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'అక్రమంగా వెలిసిన పాన్ షాప్ తొలగించాలి'

MNCL: బెల్లంపల్లి కాంట చౌరస్తా వద్ద ఆటో స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా వెలిసిన పాన్ షాప్ తొలగించాలని ఆటో యూనియన్ అధ్యక్షులు కట్ల రాంకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పోలీసులు కేటాయించిన స్థలంలోనే తాము ఆటోలు నిలుపుకుంటున్నామన్నారు. అదే స్థలంలో రాత్రికి రాత్రే అక్రమంగా పాన్ షాప్ ఏర్పాటు చేయడంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.