హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొలెరో వాహన డ్రైవర్ హల్‌చల్

మేడ్చల్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి బొలెరో డ్రైవర్ స్టంట్లు చేస్తూ హల్ చల్ చేశాడు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలో అదుపు తప్పి వాహనం రహదారి పక్కన ఉన్న ఓ షాపు వైపు దూసుకెళ్లింది. ఆ సమయంలో రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.